Om Prakash Chautala: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మృతి...! 1 d ago
హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్టీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం మరణించారు. ఆయన హర్యానా కి 1989 నుంచి 2005 వరకు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే, 1989-2005 మధ్యకాలంలో కొన్ని రాజకీయాల కారణాల వల్ల కొన్నిసార్లు ప్రభుత్వం పడిపోవడం, రాష్ట్రపతి పాలన విధించడం వలన ఒకసారి కూడా పూర్తికాలం పాటు ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగలేదు. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి 2013 నుంచి 2021వరకు జైలు శిక్షను అనుభవించారు. 16 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు 2022 మే 27న చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో 87 ఏళ్ల వయస్సులో అత్యంత రాజకీయ వృద్ధ ఖైదీగా తీహార్ జైలులో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు.